నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

ప్రకాశం: ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆటోలో ప్రయాణించిన చీరాల శ్రీనివాసరావు తన పర్సును మర్చిపోయారు. అందులో రూ.15,000 నగదు, కార్డులు ఉన్నాయి. ఆటో డ్రైవర్ కరవాది గ్రామానికి చెందిన అంజిబాబు పర్సును గుర్తించి ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు అప్పగించారు. సమాచారం అందుకున్న శ్రీనివాసరావు తన పర్సును తిరిగి పొందారు. ఆటో డ్రైవర్ నిజాయితీని జిల్లా ఎస్పీ అభినందించారు.