అర్జీలు స్వీకరించిన మంత్రి స్వామి
ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మంగళవారం అర్జీలు స్వీకరించారు. ఆయన అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార దిశగా ప్రయత్నం చేయాలని సూచించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. అధిక సంఖ్యలో హౌసింగ్ దరఖాస్తులు వచ్చినట్లు కార్యాలయ ప్రతినిధి తెలిపారు.