UPDATE: చిన్నారిపై దాడి.. పాప తల్లి ఏమందంటే..?
MDCL: షాపూర్ నగర్‌లో చిన్నారిపై స్కూల్ ఆయా పైశాచికంగా దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై పాప తల్లి స్పందించింది. పాప ఆయా కొట్టిన విషయం చెప్పింది కానీ, ఎవరో పిల్లలు కొట్టారు అనుకున్నాం. స్కూల్ పక్కన ఉన్న ఇంటిపై నుంచి వీడియో రికార్డు చేసిన యువకుడు చెప్పడంతో అసలు విషయం తెలిసింది అని పేర్కొంది. స్కూల్ యజమానికి చెపితే ఇది చిన్న విషయం వదిలేయండి అన్నారని వాపోయింది.