కర్నూలులో ముగ్గురిపై జిల్లా బహిష్కరణ

కర్నూలులో ముగ్గురిపై జిల్లా బహిష్కరణ

KRNL: జిల్లాలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యల నేపథ్యంలో ముగ్గురిపై జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఇవాళ తెలిపారు. పీ.రుద్రవరం గ్రామానికి చెందిన ఈ ముగ్గురు తీవ్ర నేరాల్లో నిందితులుగా ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నారు. దీంతో జిల్లాలో మొత్తం బహిష్కరణల సంఖ్య 8కు చేరింది.