యూరియా అమ్మకాలపై నిఘా పెట్టాలి: మంత్రి

BHPL: యూరియా అమ్మకాల పై నిరంతర పర్యవేక్షణ ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో, వ్యవసాయేతర అవసరాలకు యూరియా వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, యూరియా కొరత రాకుండా చూడాలని ఆదేశించారు.