నగరంలో కల్తీ టీ దందా బట్టబయలు
హైదరాబాద్లో భారీ కల్తీ దందా బట్టబయలైంది. సుమారు 4 టన్నుల కల్తీ టీ పౌడర్ పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాడిన టీ పౌడర్కే రంగులు కలిపి మళ్లీ అమ్ముతున్న కొంత మంది టీ షాప్ యజమానుల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. H-FAST పోలీసుల సీక్రెట్ ఆపరేషన్లో 10 మంది నిందితులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే 14 టన్నుల కల్తీ మటన్ కేసు బయటపడింది.