ఫెర్రీ వేలం పాట వాయిదా!
E.G: సీతానగరం మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరగాల్సిన పురుషోత్తపట్నం - పోలవరం ఫెర్రీ వేలం పాట వాయిదా పడింది. టెండర్ నిబంధనలపై అభ్యంతరాలు రావడం, అధికారులు హాజరుకాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాయిదా పడిన వేలం పాటను తిరిగి ఏప్రిల్ 28న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు MPDO భారతి ఒక ప్రకటనలో వెల్లడించారు.