రాజమౌళిపై హనుమకొండలో బీజేపీ ఫిర్యాదు
HNK: దర్శకుడు S.S రాజమౌళి వారణాసి టైటిల్ లాంచ్ కార్యక్రమంలో శ్రీ హనుమంతునిపై చేసిన వ్యాఖ్యలు హిందూ మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ BJP నాయకులు ఇవాళ HNKలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాజమౌళి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు దారుల్లో BJP జిల్లా సెక్రటరీ గుజ్జుల మహేందర్ రెడ్డి, సాగర్, నవీన్ తదితరులు ఉన్నారు.