కుమ్మరి & శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్‌గా లక్ష్మి

కుమ్మరి & శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్‌గా లక్ష్మి

ELR: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కుమ్మరి, శాలివాహన డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా గణపవరం మండలం మోయ్యేరుకి చెందిన టీడీపీ నాయకులు భీమవరపు లక్ష్మీ ఇటీవల నియమితులయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.