ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

కోనసీమ: మలికిపురం మండలం తూర్పుపాలెంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పు పాలెం గ్రామానికి చెందిన 33 ఏళ్ల చవ్వాకుల శివ గురువారం రాత్రి తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలం నుంచి అతని భార్య, పిల్లలు దూరంగా ఉండడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.