డిఫెన్స్ పరిశ్రమకు త్వరలో శంకుస్థాపన: ఎమ్మెల్యే
SS: మడకశిర సమీపంలోని ఆర్ అనంతపురం వద్ద డిఫెన్స్ పరిశ్రమకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలిపారు. రూ. 8,500 కోట్లతో 2,125 మెగావాట్ల అతిపెద్ద సోలార్ ప్రాజెక్టును నియోజకవర్గానికి కేటాయించినందుకు ఆయన సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు.