శాంతియుత ఎన్నికల కోసం పోలీసులు సన్నద్ధం

శాంతియుత ఎన్నికల కోసం పోలీసులు సన్నద్ధం

JGL: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల రూరల్ మండలంలోని మోతే, నర్సింగాపూర్ నామినేషన్ సెంటర్లను రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై ఉమా సాగర్ పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు, 100 మీటర్ల పరిధి నిబంధనలు అమలును పరిశీలించి, ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా సమగ్ర చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.