VIDEO: ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తం.. మాజీ ఎంపీటీసీ వాగ్వాదం
SRPT: మోతే మండలం రాఘవాపురం-సిరికొండ గ్రామాల మధ్య రోడ్డులో అక్రమ నిర్మాణాల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. రాఘవాపురం గ్రామ మాజీ ఎంపీటీసీ మద్ది మధుసూదన్ రెడ్డి తన ఇంటి ముందున్న అక్రమ ర్యాంపును తొలగిస్తుండగా అధికారులను అడ్డుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు ఎంపీడీవో ఆదేశాలతో సిబ్బంది ఆ ర్యాంపును నేలమట్టం చేశారు.