విద్యార్థుల కోసం వైద్య శిబిరం

KNR: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవపూర్ కస్తూర్బా బాలికల గురుకులం, మడిపల్లి గ్రామంలో మంగళవారం వైద్య శిబిరాలు నిర్వహించారు. డాక్టర్ వరుణ పర్యవేక్షణలో డాక్టర్లు సంధ్యారాణి, బిందు, సంధ్య ఆధ్వర్యంలో 125 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఏడుగురి జ్వర పీడితుల రక్త నమూనాలు సేకరించారు. పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు.