టీ తాగుతున్నారా?.. జాగ్రత్త!
కొందరు టీ తాగగానే ఎక్కడా లేని ఉత్తేజం పొందుతారు. అయితే రోజుకు 3 కప్పులకు మించి తాగడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇందులోని కెఫిన్ కారణంగా నిద్రలేమి, ఆందోళన, జీర్ణ సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. ఇంకా ప్రేగులు, కాలేయంపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. టీ మానేస్తే BP, బరువు నియంత్రణలో ఉంటాయని, హార్మోన్ల సమతుల్యత సాధించొచ్చని సూచిస్తున్నారు.