మూడో విడత పంచాయతీ ఎన్నికలకు భారీ బందోబస్తు
SRD: జిల్లాలో మూడో విడత ఎన్నికలు జరిగే 8 మండల గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం 1,160 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ మంగళవారం తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కౌంటింగ్ ముగిసే వరకు బందోబస్తు ఉంటుందని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు