ఈద్గా మైదానాన్ని సందర్శించిన SP

ఈద్గా మైదానాన్ని సందర్శించిన SP

ADB: రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్ పట్టణంలోని ఈద్గా మైదానాన్ని శుక్రవారం సందర్శించారు. పట్టణంలో దాదాపు 250 మంది సిబ్బందితో బందోబస్తు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈరోజు రాత్రి నుండి పటిష్ట బందోబస్తు ప్రక్రియ మొదలవుతుందని, సిబ్బంది అందరూ అప్రమత్తమై ఉండాలని సూచించారు.