మూడు స్కీములు.. ఆరు స్కాములుగా పాలన

NLR: మూడు స్కీములు, ఆరు స్కాములుగా కూటమి పాలన సాగుతుందని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. బుధవారం ఆత్మకూరు పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని వైసీపీ నేతలు ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.