జిల్లాకు ఐదురోజుల వర్ష సూచన

ATP: జిల్లాలో మరో ఐదురోజుల్లో వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం. విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి బుధవారం తెలిపారు. నేడు 3.2 మి.మీ, 15న 6.1, 16న 8.6, 17న 7.9, 18వ తేదీన 11.2 మి.మీ సగటు వర్ష పాతం నమోదు కావొచ్చని తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.