VIDEO: యాదాద్రీశుడి హుండీ ఆదాయంరూ.1.52 కోట్లు
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి భక్తుల కానుక రూపంలో వచ్చిన 20 రోజుల హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. అందులో నగదు రూ.1,52,01,420. మిశ్రమ బంగారం 54 గ్రాముల, 100 మిల్లీ గ్రాములు, మిశ్రమ వెండి 2 KG 700 గ్రాములు, స్వామి వారి ఖజానాకు సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.