బాహుబలి పనస.. ఇరగ్గాసిన చెట్టు

బాహుబలి పనస.. ఇరగ్గాసిన చెట్టు

PPM: కురుపాం మండలం లండగోర్లిగూడలో ఒకే పనస చెట్టుకు 150పైగా కాయలు కాసింది. సాధారణంగా ఒక చెట్టుకు 80లోపు కాయలు కాస్తుంటాయని ఈసారి చాలా ఎక్కువగా కాపు వచ్చిందని స్థానికులు అంటున్నారు. అలాగే ఈ సంవత్సరం ఏజెన్సీ ప్రాంతాలలో పనస దిగుబడి చాలా ఎక్కువగా ఉంటుందని గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ మార్గంలో వెళ్లేవారు పనసచెట్టును ఆశ్చర్యంగా చూస్తున్నారు.