BREAKING: ఏపీలో ఆయుధాల కలకలం
AP: కృష్ణా జిల్లా పెనమలూరులో ఆయుధాలు కలకలం రేపాయి. ఆక్టోపస్ బృందాలు తనిఖీలు నిర్వహించి ఓ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓ భవనంలో ఆయుధాలు ఉన్నట్లు గుర్తించారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ నేపథ్యంలో తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. అలాగే, కొత్త ఆటోనగర్‌లో 8 మంది అనుమానితులను గుర్తించినట్లు తెలుస్తోంది.