జిల్లాలో నిలిచిన సంచార పశువైద్య సేవలు

SKLM: శ్రీకాకుళం జిల్లా పరిధిలో సంచార పశువైద్య (1962) సేవలు సోమవారం నుంచి నిలిచిపోయాయి. 1962 వెటర్నరీ అంబులెన్సులు 18 వాహనాలు అందుబాటులో ఉండగా, వాటి నిర్వహణ ఒప్పందం జీవీకే సంస్థతో ఆదివారం నాటికి ముగిసింది. ఈ నేపథ్యంలో సిబ్బంది విధులకు హాజరు కాలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా సంచార పశువైద్య సేవలు నిలిచిపోయాయి.