కలకలం రేపుతున్న చైన్ స్నాచింగ్ (సీసీ ఫుటేజ్)
నిజామాబాద్‌లో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన ఈనెల రెండో తేదీన జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని చంద్ర నగర్ ప్రాంతంలో గల ఓ కిరాణా షాప్‌లో విక్స్ కావాలంటూ వచ్చిన ఓ యువకుడు షాపు యజమానిని నమ్మించి ఆమె మెడలో ఉన్న చైను లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలలో రికార్డు అయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది