ఆ ఘటనతో జగన్ స్వరూపం బయటపడింది: నిమ్మల
AP: పాము తన పిల్లలను తానే తిన్నట్లు జగన్ వైఖరి ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. అధికార, ధన దాహం కోసం తల్లి, చెల్లి, బాబాయ్ ఎవరినైనా ఆయన పక్కన పెడతారని ఆరోపించారు. కడపలో పెద్ద దస్తగిరి హత్యే వైసీపీ రక్తచరిత్రకు నిదర్శనమని మండిపడ్డారు. ఈ ఘటనతో వారి అసలు స్వరూపం బయటపడిందని ఆయన విమర్శించారు.