ఇంటర్ పరీక్షలకు 40 మంది గైర్హాజరు: డీఈవో
ASR: జిల్లాలో సార్వత్రిక విద్యా పీఠం ఓపెన్ ఇంటర్ పరీక్షలు ఈనెల 2 నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం జరిగిన తెలుగు పరీక్షకు 500మందికి గాను 462 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే, హిందీ పరీక్షకు ఇద్దరు గైర్హాజరైనట్లు డీఈవో రామకృష్ణారావు పేర్కొన్నారు.