MRO ఆఫీసులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ప్రకాశం: దిత్వా తుఫాన్ నేపథ్యంలో మార్కాపురం MRO కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు MRO చిరంజీవి తెలిపారు. గత తుఫాన్ ముంపు ప్రాంతాల్లో ఇప్పటికే రెవిన్యూ, సచివాలయ అధికారులను నియమించామని, ప్రజలను కూడా అలర్ట్ చేసామన్నారు. కరెంట్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలు, చెట్లు కింద ఉండరాదన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న 9281034480ను సంప్రదించాలని కోరారు.