రెండు నెలలు చేపల వేట నిషేధం

NLR: జిల్లాలోని సర్వేపల్లి రిజర్వాయర్‌లో జూలై 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు చేపల వేటను నిషేధం విధించారు. ఈ మేరకు మత్స్యశాఖ సహాయ పరిశీలకుడు ఏ పొట్టయ్య ఆదివారం తెలిపారు. రెండు నెలల పాటు తల్లిచేప గుడ్డు దశలో ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా చేపల వేటకు వెళ్తే చర్యలు తీసుకుని లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.