రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీ

రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీ

TPT: పుత్తూరు మండలం తడుకు పంచాయతీ తడుకు రైతు సేవా కేంద్రంలో సోమవారం రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమం జరిగింది. రూరల్ పార్టీ అధ్యక్షులు అరవ బాలాజీ రైతులకు యూరియా అందజేశారు. కూటమి ప్రభుత్వంలో యూరియా కొరత లేకుండా రైతులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి హేమంత్ కుమార్, తడుకు సర్పంచ్ బొబ్బిలి యాదవ్, కూటమి నాయకులు పాల్గొన్నారు.