అంకోలిలో రోడ్లపైనే మురుగు

ADB: రూరల్ మండలం అంకోలి గ్రామంలోని పోచమ్మ కాలనీలో రోడ్లపై మురుగు ప్రవహిస్తోంది. దీంతో కాలనీ వాసులు రోడ్లపై నడిచేందుకు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో సరైన మురికి నాళాలు లేకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతుందని గ్రామస్థులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.