కానిస్టేబుల్‌ను ఈడ్చుకెళ్లిన కారు దొంగ

కానిస్టేబుల్‌ను ఈడ్చుకెళ్లిన కారు దొంగ

ప్రకాశం: గిద్దలూరుకు సమీపంలోని హైవేపై వాహనాల తనిఖీలు జరుగుతుండగా డయల్ 100కు ఓ దుండగుడు కారును దొంగతనం చేసి వస్తున్నాడని సమాచారం వచ్చింది. దీంతో గిద్దలూరు కానిస్టేబుల్ రసూల్ అనుమానాస్పదంగా కనిపించిన కారును ఆపి వివరాలు అడుగుతుండగా.. దొంగ అకస్మాత్తుగా కారు స్టార్ట్ చేసి రసూల్‌ను ఢీకొట్టి, కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి.