ఎండాడ పాఠశాలను తనిఖీచేసిన ఎమ్మెల్యే గంటా
VSP: గొల్లల ఎండాడ ప్రాథమిక పాఠశాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి, వారి ఆటపాటలను అభినందించారు. మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా వడ్డించి, పిల్లలతో కలిసి భోజనం చేశారు. పాఠశాల వద్ద నిర్మాణంలో ఉన్న కల్వర్టును త్వరగా పూర్తి చేయాలని, బోరు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.