ఉరేసుకొని మహిళ ఆత్మహత్య..!
నల్గొండ జిల్లా శాలిగౌరారం మార్కెట్ సమీపంలో ఆదివారం సాయంత్రం సునీత (35) అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. సునీత ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.