ఇథనాల్‌తో రైతులకు ప్రోత్సాహం: కలెక్టర్

ఇథనాల్‌తో రైతులకు ప్రోత్సాహం: కలెక్టర్

KDP: ఇథనాల్ వినియోగాన్ని పెంచితే రైతులకు ప్రోత్సాహం లభిస్తుందని కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. ప్రొద్దుటూరులో రెవెన్యూ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులు ఆయన ప్రారంభించారు. కాలుష్యాన్ని తగ్గించడానికి పెట్రోలులో ఇథనాల్ వాడుతున్నారన్నారు. వరి, మొక్క, జొన్న పంటల ద్వారా ఇథనాల్ తయారవుతుందన్నారు. కాగా, ఇథనాల్ వినియోగంతో రైతులకు మేలు చేకూరుతుందని కలెక్టర్ చెప్పారు.