పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన జేసీ

పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన జేసీ

​VZM: పూసపాటిరేగ మండల పరిధిలోని కనిమెల్ల గ్రామంలో గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు ఆయన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం జేసీ మాట్లాడుతూ.. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా పారదర్శకంగా సర్వే నిర్వహించి, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హక్కు పత్రాలను అందజేస్తున్నట్లు తెలిపారు.