44 కేజీల గంజాయి పట్టివేత

PPM: ఒడిస్సా నుంచి తమిళనాడుకు 44 కేజీల గంజాయి ప్యాకెట్లను కారులో రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పార్వతీపురం పట్టణ సీఐ కె.మురళీధర్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు శనివారం పట్టణ ఎస్సై గోవింద తన సిబ్బందితో కలిసి రాయగడ రోడ్ చివర ఉన్న పెట్రోల్ బంకు వద్ద ముమ్మర తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డారన్నారు.