మచిలీపట్నంలో జెండా ఆవిష్కరించిన మంత్రి

కృష్ణా: మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశభక్తి గీతాలు ఆలపించారు. స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుంటూ, ప్రజల్లో దేశసేవ భావం పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.