'అవార్డులకు ధరఖాస్తులు సమర్పించాలి'
PPM: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ అవార్డులకు దరఖాస్తులను జూలై 31లోగా సమర్పించుకోవాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ప్రతీ సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. అందులో భాగంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారు అర్హులన్నారు.