'సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలి'

'సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలి'

ASR: సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని కొయ్యూరు MPDO ప్రసాదరావు ఆదేశించారు. మంగళవారం ఎం.మాకవరం గ్రామ సచివాలయం తనిఖీ చేశారు. సచివాలయ రికార్డులను, హాజరు పట్టీని తనిఖీ చేశారు. సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు గురించి ఆరా తీశారు. సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.