ఆస్తి వివాదం.. తమ్ముడిపై అన్న దాడి..!

ఆస్తి వివాదం.. తమ్ముడిపై అన్న దాడి..!

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆస్తి వివాదం ఘర్షణకు దారితీసిన ఘటన శుక్రవారం జరిగింది. పొన్నేటిపాలెం పంచాయితీ చిప్పిలికి చెందిన నాగిరెడ్డి, తన అన్న కేశవరెడ్డిని వ్యవసాయ భూమిలో వాటా అడిగాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో అన్న కత్తితో తమ్ముడిపై దాడి చేశాడు. ఈ దాడిలో నాగిరెడ్డి తీవ్రంగా గాయపడ్డట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.