నీలుగాయిని కాపాడిన కాలనీవాసులు

నీలుగాయిని కాపాడిన కాలనీవాసులు

NRML: ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని అరాఫత్ కాలనీలోకి తప్పిపోయి వచ్చిన నీలుగాయిని కాపాడి స్థానికులు మానవత్వం చాటుకున్నారు. ఆ కాలనీకి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతం నుండి బుధవారం నీలుగాయి వచ్చింది. దానిపై ఊర కుక్కలు దాడి చేయగా స్థానికులు కాపాడి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకుని నీలుగాయికి చికిత్స చేయించి మళ్లీ అడవిలో వదిలేశారు.