'ప్రభుత్వ పాఠశాలలో కిషోర్ రక్ష హెల్త్ క్యాంప్'
WGL: నల్లబెల్లి మండలంలోని మేడపల్లి, గొల్లపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో ఇవాళ PHC డా. జ్యోతి ఆధ్వర్యంలో ‘కిషోర్ రక్ష’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, 85 మంది విద్యార్థులకు జనరల్ హెల్త్ స్క్రీనింగ్, బ్లడ్ గ్రూప్, హిమోగ్లోబిన్, కంటి పరీక్షలు చేశారు. అనంతరం అవసరమైన మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు ఉన్నారు.