ఎండల దెబ్బకు విలవిలలాడుతున్న కోళ్లు..!

ఎండల దెబ్బకు విలవిలలాడుతున్న కోళ్లు..!

MBNR: కౌకుంట్ల మండలంలో భానుడి భగభగలకు పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకోలేక కోళ్లు మృత్యువాత పడుతుండటంతో యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండ వేడికి కోళ్లలో మరణాల రేటు పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వాపోతున్నారు. మే నెల రాకముందే పరిస్థితి ఇలా ఉంటే, ముందు ముందు తమ పరిస్థితి ఏంటని వారు ఆందోళన చెందుతున్నారు.