వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన MLA

KNR: హుజూరాబాద్ పట్టణంలో నిన్న కురిసిన భారీ వర్షంతో జలమయమైన పలు వార్డులను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్ పనులు వేగవంతం చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. స్వయంగా వరద బాధితుల ఇంటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.