'చెత్తను అమ్మి ఆదాయం పెంచుకోవాలి'

SKLM: రూరల్ మండలం పరిధిలోని రాగోలు చెత్త సంపద కేంద్రాన్ని డిప్యూటీ ఎంపీడీఓ కె.సూర్యనారాయణ శనివారం సందర్శించారు. ప్రతి రోజు సేకరించిన చెత్త నుంచి ప్లాస్టిక్, గాజు సీసాలు, రబ్బరు వంటి తదితర వస్తువులను వేరు చేసి ఎప్పటికప్పుడు అమ్మకాలు జరిపి పంచాయతీ ఆదాయం పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తిరుమల దేవి ఉన్నారు.