జగిత్యాలలో రూ .100కోట్ల విలువైన ఆస్తి కబ్జా

జగిత్యాలలో రూ .100కోట్ల విలువైన ఆస్తి కబ్జా

JGL: జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో యాజమాన్య హక్కులు లేకుండా రూ.100 కోట్ల విలువైన ఆస్తిని అక్రమంగా కబ్జా చేశారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం జగిత్యాల ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్, డీసెల్, కిరోసిన్ పంపుల కోసం కేటాయించిన స్థలాన్ని వారసత్వ ఆస్తిగా పంపకాలు చేసుకున్నారన్నారు.