కారు, బైక్ ఢీ.. యువకుడు మృతి

కారు, బైక్ ఢీ.. యువకుడు మృతి

BHNG: బైక్‌ను కారు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన ఆలేరులో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎర్ర ఉదయ్(22) తన తల్లిని బైక్‌పై పురపాలిక కార్యాలయం వద్ద దించి వెళ్తుండగా.. ఫ్లై ఓవర్‌పై ఎదురుగా వస్తున్న కారు ఉదయ్ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.