జెడ్పీ పాఠశాలను సందర్శించిన జాయింట్ డైరెక్టర్
NRML: దిలావార్‌పూర్‌లోని జెడ్పీ ఉన్నత పాఠశాలను ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ కే. సత్యనారాయణ రెడ్డి సోమవారం పరిశీలించారు. తరగతి గదులు, మధ్యాహ్న భోజన వంటశాల, హాజరు రిజిస్టర్‌లు పరిశీలించి పలు సూచనలు అందించారు. ఆన్లైన్‌లో సమ్మెటివ్ పరీక్ష ఫలితాల అప్‌లోడ్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాల గైర్హాజరులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.