గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఏలూరు నగరంలోని స్థానిక R.R.పేటలో ఫుట్ పాత్‌పై బుధవారం గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు వెంటనే ఏలూరు టూ టౌన్ సీఐ (94407 96606) లేదా టూ టౌన్ ఎస్సై (9948890429)కి సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.