VIDEO: వైభవంగా వెంకన్న తోటోత్సవం
AKP: నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా సోమవారం తోట ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను రాజాధిరాజు వాహనంపై అధిష్టింప చేసి లక్ష్మీపురం గ్రామ సమీపంలో గల స్వామివారి తోటలోకి తీసుకువెళ్లి నివేదనలు, తీర్థ గోష్టి నిర్వహించి ప్రసాద వినియోగం చేశారు. అనంతరం ఉత్సవమూర్తులతో తిరువీధి సేవ నిర్వహించారు.